top of page

అబద్ధాల చేత అంధత్వం

మానవులు గొప్ప అన్వేషకులు, వారు లోతుగా శోధించే మరియు సమాధానాల కోసం వెతికే ధోరణిని కలిగి ఉంటారు, కానీ వాస్తవ సత్యాన్ని కనుగొనడంలో సంతోషించే బదులుగా వారు కోరుకునేదే చూడాలని, వినాలని మరియు తెలుసుకోవాలనుకుంటారు. ఏది ఏమైనా నిజం అంటే ఏమిటి? ఒక అసహ్యమైన వాస్తవికత, కఠినమైన చేదు వాస్తవం, దాచబడిన నిధి, అది కనుగొనబడినప్పటికీ అంగీకరించడం కష్టం కాబట్టి తిరిగి దాచబడుతుంది. మరోవైపు అబద్ధానికి సవరించబడిన నిర్వచనాలు ఉన్నాయ్: వ్యక్తిగత అభిప్రాయం, ఒక డిఫెన్స్, తప్పించుకునే మార్గం, సులభమైన మార్గం, సత్వరమార్గం (షార్ట్కట్), రక్షణ కవచం మొదలైనవి. ప్రతి ఒక్కరికి వారి జీవితంలోని అబద్ధాలకు స్వంత సాకులు ఉంటాయి. అలాంటప్పుడు సత్యం దాని విలువ కోల్పోయిందా?


తిరుగుబాటు చేయుటయు యెహోవాను విసర్జించుటయు మా దేవుని వెంబడింపక వెనుకదీయుటయు బాధకరమైన మాటలు విధికి వ్యతిరిక్తమైన మాటలు వచించుటయు హృదయమున యోచించుకొని అసత్యపుమాటలు పలు కుటయు ఇవియే మావలన జరుగుచున్నవి. న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది నీతి దూరమున నిలుచుచున్నది సత్యము సంతవీధిలో పడియున్నది ధర్మము లోపల ప్రవేశింపనేరదు.

[1]

నన్ను ఒక దర్శనం ద్వారా మిమ్మల్ని నడిపించనివ్వండి. ఒక వ్యక్తి పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడు, అతను కళ్లకు గంతలు కట్టుకుని ఉండటం మాత్రమే ఆటంకం, అయినప్పటికీ అతను సానుకూలంగా ఉన్నాడు మరియు అతను వెలుగులో నడుస్తున్నట్లు జీవితాన్ని గడుపుతాడు. ఈ మనిషి చుట్టూ వెలుగు ఉందన్నది నిజమే అయినా, అతడు మాత్రం చీకటిలోనే ఉన్నాడు. ఇప్పుడు ఈ ఆశావాద వ్యక్తికి రాయి తగిలి తన పాదానికి గాయం అయ్యేంత వరకు అది తప్పు దారి అని తెలుసుకోకుండా నమ్మకంగా దారిలో వెళ్ళుతున్నాడు. అప్పుడు తనను తాను ఎత్తుకుని, పాదరక్షలు మార్చుకుని, సహాయక కర్ర పట్టుకుని, కష్టాలను అధిగమించే తెలివి తనకుందని గర్వంగా నడుచుకుంటూ వెళతాడు. దూరం నుండి ఒక అరుపు వినబడింది, అతని చుట్టూ ఉన్నవారు, ఎవరైనా గమ్యాన్ని చేరుకోవడంలో విఫలమయ్యారని చెప్పారు. ఇప్పుడు ఈ మనిషి దారిలో ముందుకు వెళుతూనే ఉన్నాడు, ఏటవాలుగా ఉన్న లోయను చూడలేదు. ఓ! అది ఒక గొప్ప పతనం. అతని చుట్టుపక్కల ప్రజలు మళ్లీ అదే తేల్చారు, "అతను సాధించలేకపోయాడు." మరియు వారు కూడా ప్రయాణాన్ని కొనసాగించి అదే లోయలో పడతారు. ఇప్పుడు మీరు ఇతర వ్యక్తులు కూడా కళ్లకు గంతలు కట్టుకున్నారని గ్రహించి ఉండాలి. అయినప్పటికీ, వారు ఎందుకు అసలు రక్షించబడలేదు?


శతాబ్దాల తరబడి ఏదో ఒకటి విశ్వసించి అనుసరిస్తున్నందున అది సత్యం మరియు సరైన మార్గం అని అర్థం కాదు. అసత్యాలు వాస్తవికతను అడ్డుకుంటాయి, మన జీవితాలను చీకటితో నింపుతాయి మరియు విధ్వంసం కలిగిస్తాయి. మనము వైఫల్యానికి సాక్ష్యాలను చూసినప్పటికీ మనము గ్రహించి దారి మళ్లించకూడదనుకుంటున్నాము, ఎందుకంటే అబద్ధాలు సౌకర్యవంతంగా ప్రయోజనకరంగా ఉంటాయి, అవి సమాజానికి ఆమోదయోగ్యమైనవి మరియు మన అహంకారాన్ని సంతృప్తిపరుస్తాయి. కాని ఒప్పుకొని మారే వ్యక్తికి జీవితం చాలా సులభం అవుతుంది.


ఇలా వ్రాయబడింది ఏమనగా,


"రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ పాపములు, ఆయన ముఖమును మీకు మరుగు పరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతులు రక్తముచేతను, మీ వ్రేళ్లు దోషముచేతను అపవిత్రపరచబడియున్నవి. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడునుబట్టి మాటలాడుచున్నది. నీతినిబట్టి యెవడును సాక్ష్యము పలుకడు, సత్యమునుబట్టి యెవడును వ్యాజ్యెమాడడు, అందరు వ్యర్థమైనదాని నమ్ముకొని మోసపుమాటలు పలుకుదురు, చెడుగును గర్భము ధరించి పాపమును కందురు....

వారి కాళ్లు పాపముచేయ పరుగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును, వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి. శాంతవర్తనమును వారెరుగరు, వారి నడవడులలో న్యాయము కనబడదు, వారు తమకొరకు వంకరత్రోవలు కల్పించుకొను చున్నారు, వాటిలో నడచువాడెవడును శాంతి నొందడు..

కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది, నీతి మమ్మును కలిసికొనుటలేదు, వెలుగుకొరకు మేము కనిపెట్టుకొనుచున్నాము గాని చీకటియే ప్రాప్తించును, ప్రకాశముకొరకు ఎదురుచూచుచున్నాము గాని అంధకారములోనే నడచుచున్నాము. గోడ కొరకు గ్రుడ్డివారివలె తడవులాడుచున్నాము, కన్నులు లేనివారివలె తడవులాడుచున్నాము, సంధ్యచీకటియందువలెనే మధ్యాహ్నకాలమున కాలు జారి పడుచున్నాము, బాగుగ బ్రతుకుచున్నవారిలోనుండియు చచ్చినవారి వలె ఉన్నాము..

మేమందరము ఎలుగుబంట్లవలె బొబ్బరించుచున్నాము, గువ్వలవలె దుఃఖరవము చేయుచున్నాము, న్యాయముకొరకు కాచుకొనుచున్నాము గాని అది లభించుటలేదు, రక్షణకొరకు కాచుకొనుచున్నాము గాని అది మాకు దూరముగా ఉన్నది..." [2]


 

అప్పుడు తూర్పు యెరూషలేములోని సిలోయం ప్రాంతం లో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను అంధుడిగా జన్మించాడు కావున జీవితం అతనికి చాలా సవాలుగా ఉంది. ఆ రోజుల్లో, విభిన్న సామర్థ్యాలతో (అంగవైకల్యం) జన్మించిన వారిని దేవుడు శిక్షించాడని భావించేవారు, అందుకే ప్రజలు అతనిని చాలా తక్కువగా ప్రేమించేవారు. ఈ వ్యక్తి ఎదుర్కొన్న తిరస్కరణ, అతనిని గుర్తింపును కోల్పోయేలా చేసింది మరియు ఊహాజనిత పక్షవాతం కలిగించింది, జీవితంలో ఏదైనా చేయటానికి అతన్ని అడ్డుకుంటుంది. కాబట్టి, జీవించి ఉన్న తల్లిదండ్రులు ఉన్నప్పటికీ, అతను తన రోజువారీ భోజనం తినడానికి బిచ్చగాడిలా అడుక్కుంటూ కూర్చున్నాడు. ఒక వెలుగు మయమైన వ్యక్తి అటుగా వెళ్లాడు మరియు అతని దృష్టి ఈ గుడ్డి వానిపై పడింది. వెనుక నుంచి ఒక ప్రశ్న వినిపించింది, "వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా?"


యేసు ఇలా సమాధానమిచ్చాడు,

“వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని, దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. పగలున్నంతవరకు నన్ను పంపినవాని క్రియలు మనము చేయుచుండవలెను; రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పనిచేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను." [3]

‭ఆయన ఇట్లు చెప్పి నేలమీద ఉమ్మివేసి, ఉమ్మితో బురదచేసి, వాని కన్నులమీద ఆ బురద పూసి నీవు సిలోయము కోనేటికి వెళ్లి అందులో కడుగు కొనుమని చెప్పెను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్లి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను. ఇప్పుడు అనవసరంగా తల దూర్చే, చాడీలు చెప్పే స్వభావంతో ఎప్పటిలాగే ఇరుగుపొరుగు వారు ఇలా గొణుగుతున్నారు, "వీడు కూర్చుండి భిక్ష మెత్తుకొనువాడు కాడా?" వారు నీ కన్నులేలాగు తెరవబడెనని వాని నడుగగా, ఆ స్వస్థత పొందిన వ్యక్తి ఎలాంటి చేర్పులు లేకుండా, రహస్యాలు దాచుకోకుండా నిజం చెప్పాడు, “యేసు అను నొక మనుష్యుడు బురద చేసి నా కన్నులమీద పూసి నీవు సిలోయమను కోనేటికి వెళ్లి కడుగుకొనుమని నాతో చెప్పెను; నేను వెళ్లి కడుగుకొని చూపు పొందితిననెను.”[4] కానీ అతని పొరుగువారు ఈ సమాధానంతో సంతృప్తి చెందలేదు. ఎందుకంటే వారు 'దేవుని చేత శిక్షించబడ్డాడు' అని పిలువబడే వ్యక్తి తమతో సమానంగా మార్చబడడాన్ని వారు సహించలేదు, పైగా అతను బిచ్చగాడు, అందుకే వారు అతన్ని మతపెద్దల వద్దకు తీసుకెళ్లారు.


విచారణ ప్రారంభమైంది, ఆ వ్యక్తి జరిగిన దాని గురించి ఎన్నిసార్లు వివరించినా కుడా వారు నమ్మక, చూపు పొందినవాని తలిదండ్రులను పిలిపించి, గ్రుడ్డివాడై పుట్టెనని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా? ఆలాగైతే ఇప్పుడు వీడేలాగు చూచు చున్నాడని వారిని అడిగిరి. నిజంగా కఠినమైన హృదయం నైతికతతో ఎన్నటికీ సంతోషించదు అందుకే వారు అంధుడిని స్వస్థపరిచిన వ్యక్తిని పాపి అని ఆరోపించారు. 'విశ్రాంతి' కోసం ప్రత్యేకించబడిన సబ్బాత్ అని పిలువబడే రోజున ప్రజలు ఎటువంటి పనులు చేయకూడదని వారి చట్టం ఆదేశించినందున, స్వస్థపరిచిన వ్యక్తి విశ్రాంతి దినాన్ని పవిత్రంగా ఉంచలేదని ఆరోపించారు. స్వస్థపరచడం అపవిత్ర కార్యమా? ఇప్పుడు ఆరోపిస్తున్న వారే అనవసరంగా విచారణ జరిపి ఆ రోజే తీర్పులు వెలువరిస్తున్నారే. చూపు పొందిన గుడ్డివాడు జవాబిచ్చి వారితో ఇలా అన్నాడు,

“ఆయన ఎక్కడ నుండి వచ్చెనో మీరెరుగకపోవుట ఆశ్చర్యమే; అయినను ఆయన నా కన్నులు తెరచెను. దేవుడు పాపుల మనవి ఆలకింపడని యెరుగుదుము; ఎవడైనను దేవభక్తుడై యుండి ఆయన చిత్తముచొప్పున జరిగించినయెడల ఆయన వాని మనవి ఆలకించును. పుట్టు గ్రుడ్డివాని కన్నులెవరైన తెరచినట్టు లోకము పుట్టినప్పటినుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కానియెడల ఏమియు చేయనేరడని వారితో చెప్పెను.” [5]

బిచ్చగాడు అని పిలిచే ఈ వ్యక్తికి ఉన్న కనీస తర్కం ఈ 'నాయకులు' అని పిలవబడే వీరికి లేదు. ఇది వారి అహంకారానికి చెంప పెట్టు లాంటిది కాబట్టి, "నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింప వచ్చితివా" అని వానితో చెప్పి వాని వెలివేసిరి. ఇప్పుడు, తాను స్వస్థపరచిన గుడ్డివాడు బహిష్కరించబడ్డాడని యేసు తెలుసుకున్నప్పుడు అతనిపై కనికరం కలిగింది. యేసు గ్రుడ్డివాడిని స్వస్థపరచడమే కాకుండా అతనికి సత్యాన్ని వెల్లడించాలనుకున్నాడు, కాబట్టి అతను వానిని కనుగొని,

"నీవు దేవుని కుమారునియందు విశ్వాసముంచు చున్నావా?" అని అడిగెను.

అందుకు వాడు, "ప్రభువా, నేను ఆయనయందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడు?" అని అడుగగా

యేసు, "నీవాయనను చూచుచున్నావు; నీతో మాటలాడుచున్నవాడు ఆయనే" అనెను.

అంతట వాడు, "ప్రభువా, నేను విశ్వసించుచున్నానని" చెప్పి ఆయనకు మ్రొక్కెను.

అప్పుడు యేసు, "చూడనివారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను, అను తీర్పు నిమిత్తము నేనీలోకమునకు వచ్చితిని" అని చెప్పెను.

ఆయన యొద్దనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విని, "మేమును గ్రుడ్డివారమా" అని అడిగిరి.

అందుకు యేసు, "మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేక పోవును గాని చూచుచున్నామని మీరిప్పుడు చెప్పు కొనుచున్నారు గనుక మీ పాపము నిలిచియున్నది" అని చెప్పెను. [6]


ఈ సంభాషణ చాలా లోతైనది మరియు ఒక వ్యక్తిని దేవుడు ఎలా కొలుస్తాడనే సత్యాన్ని మనకు వెల్లడిస్తుంది. మనిషి బాహ్య రూపాన్ని మరియు స్థితిని చూస్తాడు, కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. సత్యాన్ని మరియు ధర్మాన్ని కోరుకునే వారికి అతను తనను తాను ప్రత్యక్షపరచుకుంటాడు. సత్యంలో నడవడం అందరినీ మెప్పించకపోవచ్చు కానీ అది మన ప్రాణాలను కాపాడుతుంది. అంధుడు తన కళ్ళకు మాత్రమే కాకుండా, అతని హృదయానికి మరియు ఆత్మకు కూడా స్వస్థత పొందాడు. యేసు అతనికి కొత్త గుర్తింపును ఇచ్చాడు ఎందుకంటే అతను భయం లేకుండా సత్యాన్ని వెదకాడు. యేసు తాను ఉన్న చోటికి స్వయంగా వచ్చి, అడగకపోయినా అతని హృదయాన్ని తెలుసుకొని, అతని మొర విని అతనికి మోక్షాన్ని అందించడం ఎంత అద్భుతంగా ఉంది కదా. 'గుడ్డి బిచ్చగాడు' అని పిలువబడే ఈ వ్యక్తి జీవితంలో ఇప్పుడు కళంకం తొలగించబడి మరియు సత్యం స్థాపించబడి అతను ఇప్పుడు వెలుగులో నడుస్తాడు.


 

ఎందుకంటే ఇంతకు ముందు చెప్పబడిన ప్రవచనం నెరవేరింది,

సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను, ఆయన నీతియే ఆయనకు ఆధారమాయెను...

“సీయోనునొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయుట మాని మళ్లుకొనిన వారియొద్దకును విమోచకుడు వచ్చును" ఇదే యెహోవా వాక్కు... [7]

యేసు, "నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగియుంటే నా తండ్రిని ఎరిగియుందురు; ఇప్పటినుండి మీరాయనను ఎరుగుదురు, ఆయనను చూచియున్నారు" అని చెప్పెను. [8]

దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.[9] మీరు ఈ మాట సత్యమని నమ్మి, నిత్యజీవానికి దారితీసే ఈ మార్గాన్ని ఎంచుకోవాలనుకుంటే, మీరు నాతో పాటు ఇలా చెప్పగలరా? -  "మీ మొదటి సంభాషణ చెప్పడానికి" -ఇక్కడ క్లిక్ చేయండి. 



ప్రస్తావనలు


8 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page